టాప్ 10 న్యూస్ - 9 AM
ప్రపంచవ్యాప్తంగా జరిగిన ముఖ్య విషయాలు, వార్తల్లో కొన్ని ముఖ్యమైనవి...
1. కేంద్రం సడలింపులు నేటి నుంచి
జీవితాలను రక్షించుకుంటూనే జీవనోపాధి పొందడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన లాక్‌డౌన్ మినహాయింపులు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్, ఆహారశుద్ధి పరిశ్రమల కార్యకలాపాలను పూర్తిస్థాయిలో కొనసాగించుకోవడానికి ఇప్పటికే అనుమతిచ్చిన కేంద్ర ప్రభుత్వం సోమవారం నుంచి కొత్తగా మునిసిపల్ పరిధి బయట ఉన్న ప్రాంతాల్లోని పరిశ్రమల్లో కార్యకలాపాలకు పచ్చజెండా ఊపింది. ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా లేని 353 జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా జీవనోపాధి పనులు మొదలవుతాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. ప్రవాసులపై కోవిడ్ ప్రతాపం
3. కెనడాలో కాల్పులు.. 16 మంది మృతి
కెనడాలో పోలీసు దుస్తులు ధరించి వచ్చిన ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. నోవా స్కోటియా రాష్ట్రంలో ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఓ మహిళా పోలీసు సహా 16 మంది మృతిచెందారు. పోలీసుల కాల్పుల్లో దుండగుడు కూడా మృతిచెందినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు, స్థానిక యంత్రాంగం.. ఇప్పటికే కరోనా వైరస్ వల్ల లాక్‌డౌన్‌లో ఉన్న ప్రజల్ని అసలే బయటకు రావొద్దని సూచించారు. దుండగుడు పోలీసుల దుస్తులు ధరించి, కారును కూడా పోలీసుల వాహనం వలే రూపొందించాడని అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. ఇంకెన్ని లింకులున్నాయో..?
సూర్యాపేటలోని కూరగాయల మార్కెట్, ఔషధ దుకాణం ప్రాంతంలో వైరస్ ఎలా విస్తరించిందన్న దానిపై వివిధ కోణాల్లో ప్రత్యేక దర్యాప్తు బృందాలు శోధిస్తున్నాయి. ఔషధ దుకాణంలో పనిచేసే వ్యక్తి నుంచి అక్కడికి వచ్చిన మహిళ ద్వారా కరోనా సోకిన నేపథ్యంలో అక్కడ ఇంకా ఎవరు ఔషధాలు కొనుగోలు చేశారనే దిశగా అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ దుకాణం ప్రైవేటు వైద్యశాలలు విస్తరించిన ప్రాంతంలో ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. అగ్రరాజ్యానికి కాసింత ఊరట
కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రపంచ దేశాలకు ఆదివారం కొంతలో కొంత ఉపశమనం లభించింది. మునుపటి రోజులతో పోలిస్తే పరిస్థితి కాస్త తెరిపిన పడింది. ప్రాణనష్టం కాస్త తగ్గుముఖం పట్టింది. న్యూయార్క్‌లో మృతుల సంఖ్య ఆదివారం 550 కంటే తక్కువ నమోదయింది. ఈ స్థాయికి ప్రాణనష్టం తగ్గడం గత రెండువారాల్లో ఇదే తొలిసారి. కొత్తగా ఆసుపత్రుల్లో, ముఖ్యంగా ఐసీయూలలో చేరే రోగుల సంఖ్య తగ్గింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. కరోనా పుట్టుకపై ఎన్నెన్నో ఊహన్‌లు
7. కృత్రిమ యాంటీబాడీలతో కరోనా కట్టడి!
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వైద్యనిపుణులు, పరిశోధకులు వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రయోగశాలల్లో నిర్విరామంగా కృషి చేస్తున్నారు. మహమ్మారి బారి నుంచి బాధితులను కాపాడేందుకు వేర్వేరు చికిత్స పద్ధతులను అనుసరిస్తున్నారు. సరైన మందులు, టీకా లేకపోవడంతో ప్లాస్మా చికిత్సపై వైద్యనిపుణులు దృష్టి సారించారు. అనుకున్నంత కాకపోయినా సంతృప్తికరమైన ఫలితాలొస్తుండడంతో చికిత్సలో ఈ పద్ధతిని అవలంబిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్టే : చిరంజీవి
పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. పోలీసుశాఖలో కరోనా కలకలం
‘మీ ఆరోగ్యం కోసం మేం వీధుల్లో ఉంటాం. మీరు ఇంట్లోనే ఉండండి’ అంటూ భరోసా ఇస్తున్న పోలీసన్నలపై కరోనా ప్రభావం చూపుతోంది. తాజాగా రెండు రోజుల్లో ఇద్దరు కానిస్టేబుళ్లకు వైరస్ సోకడంతో బాధితుల సంఖ్య మూడుకు చేరింది. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బందికి ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ధైర్యం చెబుతూ, అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ వైరస్ సోకుతుండటం కొంత కలవరపాటుకు గురిచేస్తోంది. కరోనా నియంత్రణలో భాగంగా గత నెల 22 నుంచి రాష్ట్రంలో దాదాపు 60వేల మంది పోలీసులు రోడ్లకే అంకితమయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. ప్రధాని చెప్పిన పానీయం
రోగనిరోధక శక్తిని పెంచుకునే దిశగా ప్రజలంతా ‘కధా’ తాగాలని ప్రధాని కోరారు. వనమూలికలు, సుగంధ ద్రవ్యాల సమ్మేళనమైన ఈ ఆయుర్వేద పానీయాన్ని ఎలా తయారుచేయాలంటే.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
రంగంలోకి కేంద్ర నిఘా సంస్థ.. డేటా లీకేజీ వ్యవహారంలో మలుపులు
-
Crime News
కారుపై ‘పొక్లెయిన్’ పిడుగు!.. ముగ్గురి దుర్మరణం.. ఇద్దరికి తీవ్రగాయాలు
-
Ap-top-news News
పాపికొండల విహారయాత్రకు పచ్చ జెండా
-
Politics News
‘వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటేయం’.. ఎచ్చెర్ల ఎమ్మెల్యేకు తేల్చిచెప్పిన వైకాపా కార్యకర్తలు
-
Sports News
భారత్తో బంధం ప్రత్యేకమైంది: ఏబీ డివిలియర్స్
-
Ap-top-news News
సీఎం జగన్ కోసం 2 గంటలు వాహనాల మళ్లింపు