ఏపీకి 1,892కోట్లు..తెలంగాణకు రూ.982 కోట్లు

కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన ఏప్రిల్‌ నెల వాటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.46,038 వేల కోట్ల నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ

Published : 21 Apr 2020 01:12 IST

కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా విడుదల

దిల్లీ: కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన ఏప్రిల్‌ నెల వాటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.46,038 వేల కోట్ల నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ మేరకు ట్విటర్‌లో ఆయా రాష్ట్రాలకు ఇచ్చిన నిధుల వివరాలను పేర్కొంది. ఏపీకి రూ.1892.64కోట్లు, తెలంగాణకు రూ.982 కోట్లు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఈ నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసింది. అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌కు రూ.8255.19కోట్లు.. అత్యల్పంగా గోవాకు రూ.177.72 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రాలకు కేటాయించిన నిధులు వివరాలు కింది పట్టికలో..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని