
సీఎం ప్రత్యేక ప్రోత్సాహకంపై ఉత్తర్వులు జారీ
హైదరాబాద్: ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనా వైరస్ చికిత్సతో పాటు ఇతర సహాయక చర్యలు, విధుల్లో పాల్గొంటున్న వివిధ విభాగాలకు చెందిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్ నెలకు సీఎం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందనున్నాయి. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రోత్సాహకాలకు సంబంధించి ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వైద్యారోగ్య శాఖకు చెందిన పూర్తిస్థాయి, ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులు, పోలిసు శాఖ ఉద్యోగులందరికీ మూల వేతనంలో 10 శాతం మొత్తాన్ని ప్రోత్సాహకంగా ప్రభుత్వం అందించనుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో పనిచేసే పూర్తిస్థాయి, పొరుగుసేవల పారిశుద్ధ్య సిబ్బంది, కార్మికులు, జలమండలిలోని పూర్తి స్థాయి, పొరుగుసేవల లైన్‌మెన్లు, కార్మికులు రూ. 7,500 ప్రోత్సాహకం కింద అందుకోనున్నారు. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్లు, పురపాలికల్లోని పారిశుద్ధ్య సిబ్బంది, పంచాయతీల్లోని పారిశుద్ధ్య కార్మికులు, మల్టీపర్పస్ వర్కర్లు అందరికీ రూ. 5 వేలు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రోత్సాహకంగా ప్రభుత్వం అందించనుంది.
ఫీజులు పెంచొద్దని జీవో జారీ..
రాష్ట్రంలోని పాఠశాలలు ఫీజులు పెంచొవద్దని ప్రభుత్వం జీవో జారీ చేసింది. నెలవారీ ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని ఆదేశించింది. జీవో 46ను ఉల్లంఘిస్తే పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ సహా అన్ని ప్రైవేటు పాఠశాలలకు తాజా జీవో వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇది చదవండి..
‘కూరగాయల ధరల పెరుగుదలపై నివేదికివ్వండి’: హైకోర్టు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.