సూర్యాపేట డీఎంహెచ్‌వోపై బదిలీ వేటు

సూర్యాపేట డీఎంహెచ్‌వో నిరంజన్‌పై బదిలీ వేటు పడింది. జిల్లాలో కరోనా కేసుల ఉద్ధృతిని అదుపు చేయలేదన్న కారణంతో డీఎంహెచ్‌వోపై రాష్ట్ర

Updated : 22 Apr 2020 10:55 IST

సూర్యాపేట క్రైం: సూర్యాపేట డీఎంహెచ్‌వో నిరంజన్‌పై బదిలీ వేటు పడింది. జిల్లాలో కరోనా కేసుల ఉద్ధృతిని అదుపు చేయలేదన్న కారణంతో డీఎంహెచ్‌వోపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆయన స్థానంలో యాదాద్రి భువనగిరి జిల్లా డీఎంహెచ్‌వో సాంబశివరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  సాంబశివరావు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాకుండా సమర్థంగా పనిచేశారని గుర్తింపు ఉంది.

తెలంగాణలో మంగళవారం ఒక్క రోజే 56 కేసులు నమోదు కాగా, వీటిలో సూర్యాపేట జిల్లాలోనే అత్యధికంగా 26 మందిలో వైరస్‌ నిర్ధారణ అయ్యింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 80 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం ఐదు క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా, అందులో 210 మంది ఉన్నారు. దాదాపు 4,346 మంది గృహనిర్బంధంలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని