గడ్డిఅన్నారం మార్కెట్‌కు పోటెత్తిన మామిడి

గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌కు మామిడి పండ్లు పోటెత్తాయి. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 1600 టన్నుల మేర మామిడిని రైతులు తీసుకొచ్చారు. కరోనా...

Published : 22 Apr 2020 12:08 IST

హైదరాబాద్‌: గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌కు మామిడి పండ్లు పోటెత్తాయి. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 1600 టన్నుల మేర మామిడిని రైతులు తీసుకొచ్చారు. కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మార్కెటింగ్‌శాఖ అధికారులు ఇవాళ అర్ధరాత్రి నుంచి మూడు రోజుల పాటు  గడ్డిఅన్నారం మార్కెట్‌కు సెలవు ప్రకటించారు. దీంతో రైతులు ఒక్కసారిగా మార్కెట్‌కు తరలివచ్చారు. మామిడి అధికంగా రావడంతో మార్కెట్‌లో రద్దీ నెలకొంది.
మార్కెట్‌ ప్రాంగణంలో ఈ అర్ధరాత్రి లోగా కొనుగోళ్లు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఎవరూ మార్కెట్‌కు మామిడి తీసుకురావొద్దని, వచ్చినా మార్కెట్‌ లోపలికి అనుమతి ఉండదని మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ రామ్‌నర్సింహగౌడ్‌ తెలిపారు. మార్కెటింగ్‌శాఖ ఈనెల 27 నుంచి కోహెడలో మామిడి విక్రయాలు ప్రారంభించనుంది. ప్రస్తుతం కోహెడలో తాత్కాలిక షెడ్ల ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని