తెలంగాణలో హోం క్వారంటైన్‌ గడువు పెంపు

కరోనా వ్యాప్తిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోం క్వారంటైన్‌ గడువును 14 నుంచి 28 రోజులకు పెంచింది. రాష్ట్రంలో కొంత మందికి వైరస్‌ లక్షణాలు 28 రోజులవరకు.. 

Published : 22 Apr 2020 15:28 IST

హైదరాబాద్‌: కరోనా వ్యాప్తిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోం క్వారంటైన్‌ గడువును 14 నుంచి 28 రోజులకు పెంచింది. రాష్ట్రంలో కొంత మందికి వైరస్‌ లక్షణాలు 28 రోజులవరకు బయటపడటం లేదని.. దీని వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ప్రభుత్వం పేర్కొంది. దీంతో హోం క్వారంటైన్‌లో ఉన్నవారు ఇకపై 14 రోజులు కాకుండా 28 రోజులు ఇంట్లోనే స్వీయనిర్బంధంలో ఉండాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. కరోనా టెస్టుల విషయంలోనూ ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది. కేవలం ప్రైమరీ కాంటాక్టులకే కరోనా పరీక్షలు చేయాలని.. సెకండరీ కాంటాక్టులను టెస్ట్‌లు చేయొద్దని అధికారులకు స్పష్టం చేసింది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని