తలకెక్కించుకోవడం లేదు

ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలను కొందరు తుంగలో తొక్కుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని పోలీసులు, అధికారులు కోరినా పట్టించుకోవడం లేదు. మార్కెట్‌లు, కిరాణా దుకాణాలు, రైతు బజార్లలో... 

Updated : 24 Apr 2020 15:50 IST

లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘనలు 

హైదరాబాద్‌ : ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలను కొందరు తుంగలో తొక్కుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని పోలీసులు, అధికారులు కోరినా పట్టించుకోవడం లేదు. మార్కెట్‌లు, కిరాణా దుకాణాలు, రైతు బజార్లలో జనం రద్దీగా కనిపిస్తున్నారు. బయటకు వచ్చిన వారు మాస్కులు, గ్లౌసులు ధరించాలని సూచించినా ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా బారులు తీరుతున్నారు. హైదరాబాద్‌లోని బేగంబజార్‌, నాంపల్లి, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, కొత్తపేట, మెహిదీపట్నం రైతు బజార్లలో ప్రమాదకరంగా జనం సంచరిస్తున్నారు. స్వచ్చంధ సంస్థలు, ఎన్జీవోలు మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తున్న సమయంలోనూ వ్యక్తిగత దూరం పాటించకుండా నిలబడుతున్నారు. ఇది ఇలానే కొనసాగితే పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని