ముషీరాబాద్‌ చేపలమార్కెట్‌ తరలిస్తాం:తలసాని

నగరంలో అతి పెద్దదైన ముషీరాబాద్ టోకు చేపల మార్కెట్‌ను తాత్కాలికంగా ఆర్టీసీ బస్‌ భవన్ పక్కన ఉన్న స్థలంలోకి మార్చనున్నట్లు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ తెలిపారు. మాసబ్‌ ట్యాంక్‌ పశుసంవర్థక శాఖ సంచాలకుల కార్యాలయంలో...

Updated : 24 Apr 2020 16:53 IST

హైదరాబాద్: నగరంలో అతి పెద్దదైన ముషీరాబాద్ టోకు చేపల మార్కెట్‌ను తాత్కాలికంగా ఆర్టీసీ బస్‌ భవన్ పక్కన ఉన్న స్థలంలోకి మార్చనున్నట్లు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ తెలిపారు. మాసబ్‌ ట్యాంక్‌ పశుసంవర్థక శాఖ సంచాలకుల కార్యాలయంలో జంటనగరాల్లో చేపల మార్కెట్‌ పరిస్థితులపై మంత్రి సమీక్షించారు. ముషీరాబాద్‌లో ప్రస్తుతమున్న టోకు చేపల మార్కెట్‌ రెడ్‌జోన్‌ పరిధిలోకి రావడంతో మార్కెట్‌ కార్యకలాపాలు నిలిచిపోయాయని చెప్పారు. ఆర్టీసీ బస్‌ భవన్‌ వద్ద ఈ నెల 26వ తేదీ నుంచి చేపల మార్కెట్‌ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు.

వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున చేపలు ముషీరాబాద్‌ మార్కెట్‌కు తీసుకొస్తారని.. ఇక్కడ వ్యాపారులు కొనుగోలు చేసి చిల్లర మార్కెట్లకు తరలించి విక్రయిస్తారని మంత్రి వివరించారు. రెడ్‌ జోన్‌ పరిధిలోకి వచ్చిన తర్వాత ముషీరాబాద్‌ మార్కెట్‌లో చేపల విక్రయాలు నిలిచిపోయిన నేపథ్యంలో నగర పరిధిలో చేపల కొరత ఏర్పడిందన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మార్కెట్‌ను ప్రత్నామ్నాయంగా ఆర్టీసీ బస్‌ భవన్‌ సమీపంలోకి తరలిస్తున్నట్లు మంత్రి వివరించారు. కరోనా నేపథ్యంలో మార్కెట్‌కు వచ్చే వ్యాపారులు, వినియోగదారులు సామాజిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు తలసాని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని