నెట్టింట్లో ఏం వెతుకుతున్నారో తెలుసా!

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంటర్నెట్‌ సౌకర్యం ఉన్నవారు ఆన్‌లైన్‌లో ఆయా అంశాల మీద శోధిస్తున్నారు. ఈ క్రమంలో భారతీయులు నెల రోజులుగా ‘యాహూ’ వేదికగా ఏం వెతికారన్న వివరాలను సదరు సంస్థ ‘సెర్చ్‌ ఇన్‌ ది లాక్‌డౌన్‌’ పేరిట శుక్రవారం వెల్లడించింది...

Published : 24 Apr 2020 23:40 IST

నెలరోజుల వివరాలు వెల్లడించిన యాహూ ఇండియా

న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంటర్నెట్‌ సౌకర్యం ఉన్నవారు ఆన్‌లైన్‌లో వివిధ అంశాలను శోధిస్తున్నారు. ఈ క్రమంలో భారతీయులు నెల రోజులుగా ప్రముఖ సెర్చింజన్‌ ‘యాహూ’లో ఏం వెతికారన్న వివరాలను సదరు సంస్థ ‘సెర్చ్‌ ఇన్‌ ది లాక్‌డౌన్‌’ పేరిట శుక్రవారం వెల్లడించింది.  దీని ప్రకారం చాలావరకు నెటిజన్లు కరోనా మహమ్మారికి సంబంధించిన అంశాలను సెర్చ్‌ చేసినట్లు తేలింది. ఇందులోనే దాదాపు 427 శాతం వృద్ధి నమోదైంది. మొదటి అయిదు కీవర్డ్స్‌లో కొవిడ్‌ అప్‌డేట్స్‌, లక్షణాలు, చికిత్స, మరణాల సంఖ్య, లైవ్‌ ట్రాకింగ్‌ ఉన్నాయి. దీంతోపాటు భారత్‌లో లాక్‌డౌన్‌, కరోనా వ్యాక్సిన్‌, సోషల్‌ డిస్టెన్సింగ్‌, హైడ్రాక్సిక్లోరోక్విన్‌ అంశాలపై శోధించారు. ప్రశ్నల విభాగంలో కరోనా వైరస్‌ ఎంత కాలం జీవించి ఉంటుంది? ఇంట్లోనే మాస్క్‌ ఎలా తయారు చేసుకోవచ్చు? కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఉందా? ఎదైనా చికిత్స ఉందా? అనేవి ఎక్కువగా వచ్చాయి.
అమెజాన్‌ ప్రైం ఫస్ట్‌..
లాక్‌డౌన్‌ నేపథ్యంలో చాలావరకు ఐటీ సంస్థలు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం వెసులుబాటు కల్పించాయి. ఈ క్రమంలో అంతర్జాల వేదికగా ఉద్యోగులను ఒకచోటికి చేర్చేందుకు వీలు కల్పించే సాఫ్ట్‌వేర్‌లపై శోధనలు సాగాయి. వీటిలో జూమ్‌, స్కైప్‌, గూగుల్‌ హ్యాంగవుట్స్‌, మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌, గోటుమీటింగ్‌ మొదటి ఐదులో నిలిచాయి. ఆన్‌లైన్‌ వీడియో స్ట్రీమింగ్‌ ఓటీటీ విభాగంలో అమెజాన్‌ ప్రైం ముందు వరుసలో ఉంది. నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్‌, వూట్‌, జీ5 తరువాతి స్థానాల్లో నిలిచాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని