కరోనాపై పోరుకు AP CMRFకు విరాళాల వెల్లువ

కరోనాపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకోసం పలు సంస్థలు తమ వంతు తోడ్పాటు అందిస్తున్నాయి. కరోనా నివారణ చర్యల కోసం విరాళాలు అందజేస్తున్నాయి.

Published : 24 Apr 2020 20:37 IST

అమరావతి: కరోనాపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకోసం పలు సంస్థలు తమ వంతు తోడ్పాటు అందిస్తున్నాయి. కరోనా నివారణ చర్యల కోసం విరాళాలు అందజేస్తున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం పలు సంస్థల ప్రతినిధులు సీఎంను కలిసి చెక్కులు అందజేశారు. 

* కైకలూరు నియోజకవర్గం రైతులు; వర్తక, వాణిజ్య సంఘాలు, విద్యా సంస్థల తరఫున రూ.2కోట్ల 2లక్షల 2వేల 112

* గుంటూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) రూ.కోటి 

* రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌ - వైజాగ్‌ స్టీల్స్‌) రూ.కోటి

* కేఎంవీ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ రూ.కోటి

* బండి సాహితి రెడ్డి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ రూ.25లక్షలు

* గుంటూరు జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌) రూ.25లక్షలు

* లోటస్‌ ట్రేడింఘ్‌ కంపెనీ; డాల్ఫిన్స్‌ పాలిమర్స్‌ తరఫున రూ.25లక్షలు

* ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రజలు, వివిధ సంస్థల తరఫున రూ.36,50,000ను హోంమంత్రి సుచరిత సీఎంకు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని