నిబంధనల ప్రకారమే ఆర్డినెన్స్‌:ఏపీ ప్రభుత్వం

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తొలగింపు కారణాలపై ఏపీ ప్రభుత్వం తుది అఫిడవిట్‌ను హైకోర్టుకు సమర్పించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం సంస్కరణల్లో భాగంగా కొత్త ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ)ను నియమించామని ప్రభుత్వం అందులో పేర్కొంది. మాజీ న్యాయమూర్తులను ఎస్‌ఈసీగా...

Updated : 24 Apr 2020 20:29 IST

నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌వి నిరాధార ఆరోపణలు

ఎస్‌ఈసీ తొలగింపుపై హైకోర్టుకు తుది అఫిడవిట్‌

అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తొలగింపు కారణాలపై ఏపీ ప్రభుత్వం తుది అఫిడవిట్‌ను హైకోర్టుకు సమర్పించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం సంస్కరణల్లో భాగంగా కొత్త ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ)ను నియమించామని ప్రభుత్వం అందులో పేర్కొంది. మాజీ న్యాయమూర్తులను ఎస్‌ఈసీగా నియమించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో నూతన ఎన్నికల కమిషనర్‌ను నియమించినట్లు తెలిపింది. ఈమేరకు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఆర్డినెన్స్‌ తీసుకొచ్చామని అఫిడవిట్‌లో వెల్లడించింది. మిగిలిన రాష్ట్రాల్లో అమలవుతున్న ఎస్‌ఈసీల కాలపరిమితి వివరాలు కూడా ప్రభుత్వం అందులో పేర్కొంది.

2014 స్థానిక ఎన్నికల్లో 13 జిల్లాల్లో జరిగిన ఎన్నికల హింసకు సంబంధించిన వివరాలను సైతం కోర్టుకు వివరించింది. ఆ ఎన్నికల్లో 221 హింసాత్మక ఘటనలు జరిగితే 2020లో 88 ఘటనలు జరిగినట్లు వెల్లడించింది. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేశారని ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది. తనను కావాలనే ఎస్ఈసీ పదవి నుంచి తప్పించారంటూ నిమ్మగడ్డ చేసిన ఆరోపణలు అవాస్తమని అందులో వివరించింది.

ఇవీ చదవండి...
ఎన్నికలు సజావుగా సాగేందుకే ఆర్డినెన్స్‌:ద్వివేదీ

దురుద్దేశంతోనే ఆర్డినెన్స్‌ జారీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని