విద్యాసంవత్సరాన్ని సెప్టెంబరుకు జరపాలి

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు మూతబడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విద్యాసంవత్సరం నిర్వహణ, ఆన్‌లైన్‌ విద్యపై ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో సిఫార్సు చేయాలంటూ యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) ఇటీవల రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. శుక్రవారం ఇవి తమతమ నివేదికలను సమర్పించాయి...

Published : 25 Apr 2020 16:02 IST

యూజీసీకి నివేదిక సమర్పించిన కమిటీ

న్యూదిల్లీ: కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు మూతబడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విద్యాసంవత్సరం నిర్వహణ, ఆన్‌లైన్‌ విద్యపై ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో సిఫార్సు చేయాలంటూ యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) ఇటీవల రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. శుక్రవారం ఇవి తమతమ నివేదికలను సమర్పించాయి. 
పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు..
ఏటా జులైలో ప్రారంభమయ్యే నూతన విద్యాసంవత్సరాన్ని ఈసారి సెప్టెంబరుకు జరపాలని హరియాణా యూనివర్సిటీ వీసీ ఆర్‌సీ కుహాడ్‌ నేతృత్వంలోని మొదటి కమిటీ సూచించింది. ఇగ్నో వీసీ నాగేశ్వరరావు సారథ్యంలోని రెండో కమిటీ.. ‘సరైన వసతులు ఉంటే విశ్వవిద్యాలయాలు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించాలి. లేని పక్షంలో లాక్‌డౌన్‌ ముగిశాకే పరీక్షలు పెట్టాల’ని తెలిపింది. మానవ వనరుల అభివృద్ధి(హెచ్‌ఆర్డీ) మంత్రిత్వశాఖ ప్రస్తుతం ఈ రెండు నివేదికలను పరిశీలిస్తోంది. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని హెచ్‌ఆర్డీ ఉన్నతాధికారులు వెల్లడించారు. జేఈఈ, నీట్‌ పరీక్షలను జూన్‌లో నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాం.. కానీ ఈ క్రమంలో దేశంలో కరోనా పరిస్థితిని సమీక్షించడం కూడా ముఖ్యమని ఒక ఉన్నతాధికారి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని