రెండు నిమిషాల్లోనే.. వైరస్‌ను గుర్తించేలా..

హైదరాబాద్‌లోని మరో జాతీయ పరిశోధన సంస్థ కొవిడ్‌-19ను ఎదుర్కొనే ప్రయోగాలపై దృష్టిపెట్టింది. గచ్చిబౌలిలో బయోటెక్నాలజీ విభాగానికి చెందిన

Updated : 08 Jul 2021 16:05 IST

 యానిమల్‌ బయోటెక్నాలజీలో కొవిడ్‌-19పై పరిశోధనలు

 హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని మరో జాతీయ పరిశోధన సంస్థ కొవిడ్‌-19ను ఎదుర్కొనే ప్రయోగాలపై దృష్టిపెట్టింది. గచ్చిబౌలిలో బయోటెక్నాలజీ విభాగానికి చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయోటెక్నాలజీ(ఎన్‌ఐఏబీ)లో కరోనా వైరస్‌ను త్వరితగతిన గుర్తించే డయాగ్నస్టిక్‌ కిట్‌, వైరస్‌ ఇంజినీరింగ్‌తో కొవిడ్‌-19 ఔషధాలు పరీక్షించే వినూత్న విధానం అభివృద్ధిపై పరిశోధకులు ప్రయత్నాలు మొదలెట్టారు. కరోనా వైరస్‌ శరీరంలోని కణంతో కలవడంతో వృద్ధి చెందుతోంది. కణానికి వైరస్‌ అతుక్కుని ఉంటే వైరస్‌లోని న్యూక్లిక్‌ యాసిడ్‌ను ఎలక్ట్రో కెమికల్‌ సెన్సర్‌ గుర్తిస్తుంది. ఈ కొత్త పద్ధతిలో రెండు నిమిషాల్లోనే వైరస్‌ సోకిందో లేదో తెలిసిపోతుంది. దీనిపైనే ఎన్‌ఐఏబీ పరిశోధకులు పనిచేస్తున్నారు.

సరోగేట్‌ కణంపై..

ఎన్‌ఐఏబీ పరిశోధకులు ప్రయోగశాలలో కృత్రిమంగా సరోగేట్‌ కణం ఉపరితలంపై కరోనా వైరస్‌ ప్రొటీన్లు పెంచుతున్నారు. ఆర్‌ఎన్‌ఏ లేకుండా కేవలం ప్రొటీన్లు పెరిగేలా ఇంజినీరింగ్‌ చేస్తున్నారు. దీంతో ఔషధ పరీక్షలు చేయడం తేలిక అవుతుంది. వైరస్‌ను తగ్గించే ఔషధాలు ఇచ్చినప్పుడు వైరస్‌ ప్రొటీన్లు, రిసెప్టర్‌తో అతుక్కోకపోతే ఆ మందులు పనిచేస్తున్నట్లు నిర్ధారణకు రావొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని