వీడియో విచారణకు బనియన్‌తో న్యాయవాది

కొవిడ్‌-19 కారణంగా కేసు విచారణలను వీడియో కాన్ఫరెన్స్‌(వీసీ) ద్వారా నిర్వహిస్తున్న రాజస్థాన్‌ హైకోర్టుకు ఓ విచిత్ర ఘటన ఎదురైంది. ఓ బెయిల్‌ దరఖాస్తు కేసును జైపుర్‌ బెంచి విచారణకు చేపట్టినప్పుడు

Updated : 26 Apr 2020 10:10 IST

రాజస్థాన్‌ హైకోర్టు ఆక్షేపణ

 దిల్లీ: కొవిడ్‌-19 కారణంగా కేసు విచారణలను వీడియో కాన్ఫరెన్స్‌(వీసీ) ద్వారా నిర్వహిస్తున్న రాజస్థాన్‌ హైకోర్టుకు ఓ విచిత్ర ఘటన ఎదురైంది. ఓ బెయిల్‌ దరఖాస్తు కేసును జైపుర్‌ బెంచి విచారణకు చేపట్టినప్పుడు పిటిషనర్‌ తరపు న్యాయవాది బనియన్‌తోనే వీడియో కాన్ఫరెన్స్‌ ముందుకొచ్చారు. దీంతో అవాక్కయిన ధర్మాసనం తగిన యూనిఫాంతోనే విచారణకు రావాలని ఆదేశించింది. కేసు విచారణలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించినప్పటికీ న్యాయస్థానానికి సంబంధించిన నియమావళిని పాటించాల్సిందేనని నిర్దేశించింది. న్యాయవాది యూనిఫాం ధరించలేదన్న కారణంతో విచారణను వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని