కరోనా రహిత జిల్లాగా సంగారెడ్డి:హరీశ్‌రావు

సంగారెడ్డి జిల్లా కరోనా రహిత జిల్లాగా అవతరించిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా పరిధిలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 8 మంది బాధితులకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ రావడంతో హరీశ్‌ రావు ఆనందం

Updated : 12 Oct 2022 16:04 IST

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కరోనా రహిత జిల్లాగా అవతరించిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా పరిధిలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 8 మంది బాధితులకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ రావడంతో హరీశ్‌ రావు ఆనందం వ్యక్తం చేశారు. సమష్టి కృషితోనే ఇది సాధ్యపడిందన్నారు. కరోనా కట్టడిలో భాగంగా నిబంధనలు ఉల్లంఘించిన వారితో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని.. ప్రజలెవరూ తప్పుగా భావించొద్దని కోరారు. ప్రజల శ్రేయస్సు కోసమే పోలీసులు అలా వ్యవహరించాల్సి వస్తుందని హరీశ్‌ రావు వివరించారు.

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వానికి ఆదాయం తగ్గినప్పటికీ సంక్షేమం విషయంలో ప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదని హరీశ్‌రావు తెలిపారు. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల తెల్లరేషన్ కార్డుదారులకు ఇప్పటికే వారి బ్యాంకు ఖాతాల్లో రూ. 1500 చొప్పున జమచేసినట్లు చెప్పారు. బ్యాంకులో నగదు పడనివాళ్ళు ఆధార్, రేషన్ కార్డు తీసుకొని సమీపంలోని తపాలా కార్యాలయానికి వెళ్లి డబ్బులు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఈ నెల మాదిరిగానే వచ్చే నెల కూడా 12 కిలోల బియ్యం, రూ. 1500 నగదు అందిస్తామన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 7.50 లక్షల వలస కూలీలకు బియ్యం, రూ. 500 నగదు సాయం అందించామని మంత్రి చెప్పారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, ప్రతి పట్టణంలోని యువకులు రక్తదానం చేయాలని ఈ సందర్భంగా హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని