లాక్‌డౌన్‌ వేళ.. గర్భిణి నరకయాతన 

 శ్రీకాకుళం జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కరోనా వైరస్‌ విజృంభణ వేళ విధించిన లాక్‌డౌన్‌తో ఓ గర్భిణి నరకయాతన అనుభవించింది. వివరాల్లోకి వెళ్తే.. కొత్తూరు మండలంలోని అల్తీ పంచాయతీ దిగువరాయిగూడ గ్రామానికి చెందిన సవర

Updated : 27 Apr 2020 20:14 IST

కొత్తూరు:  శ్రీకాకుళం జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కరోనా వైరస్‌ విజృంభణ వేళ విధించిన లాక్‌డౌన్‌తో ఓ గర్భిణి నరకయాతన అనుభవించింది. వివరాల్లోకి వెళ్తే.. కొత్తూరు మండలంలోని అల్తీ పంచాయతీ దిగువరాయిగూడ గ్రామానికి చెందిన సవర వాణిశ్రీ అనే మహిళకు సోమవారం ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. సమాచారం అందుకున్న ఏఎన్‌ఎం సవరమ్మ, ఆశా కార్యకర్తలు ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. దిగువరాయిగూడ నుంచి ఒడిశా సరిహద్దు వరకు ఆటోలో తీసుకువచ్చారు. రెండు రోజుల క్రితం  అల్తీ పంచాయతీకి వెళ్లే రహదారిని మిలగాం వద్ద ఒడిశా అధికారులు తవ్వేశారు. దీంతో ఆమెను ఆటో నుంచి దింపి డోలి సహాయంతో మోసుకెళ్లి మిలగాం దాటించారు. అనంతరం అక్కడి నుంచి 108 అంబులెన్స్‌లో కొత్తూరు సామాజిక ఆసుపత్రిలో చేర్పించి వైద్య సహాయం అందిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని