సరిహద్దుల్లోని అడ్డుగోడల తొలగింపు

కరోనా నియంత్రణలో భాగంగా తమిళనాడు ప్రభుత్వం ఆంధ్ర-తమిళనాడు అంతర్‌రాష్ట్ర సరిహద్దు రహదారుల్లో నిర్మించిన అడ్డుగోడలను తొలగించారు. పలమనేరు

Updated : 28 Apr 2020 08:23 IST

చిత్తూరు కలెక్టర్‌ సూచన మేరకు  తమిళనాడు అధికారుల చర్యలు

పలమనేరు: కరోనా నియంత్రణలో భాగంగా తమిళనాడు ప్రభుత్వం ఆంధ్ర-తమిళనాడు అంతర్‌రాష్ట్ర సరిహద్దు రహదారుల్లో నిర్మించిన అడ్డుగోడలను తొలగించారు. పలమనేరు-గుడియాత్తం, నంగమంగళం-వేలూరు, చిత్తూరు-తిరుత్తణి మార్గాల్లోని రాష్ట్ర సరిహద్దుల్లో తమిళనాడు అధికారులు ఆదివారం అడ్డుగోడలను నిర్మించారు. స్పందించిన చిత్తూరు జిల్లాలోని ఆయా మండలాల అధికారులు జిల్లా కలెక్టర్‌ భరత్‌గుప్తాకు ఫిర్యాదు చేశారు. అడ్డుగోడల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆయన దృష్టికి తెచ్చారు. స్పందించిన కలెక్టర్‌ తమిళనాడు జిల్లా అధికారులను సంప్రదించారు. గోడలను తొలగించాలని కోరారు. ఆయన సూచన మేరకు మూడు ప్రాంతాల్లో నిర్మించిన గోడలను తమిళనాడు అధికారులు సోమవారం నేలమట్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని