బొబ్బిలి-పార్వతీపురం మధ్య రాకపోకలు బంద్‌

విజయనగరం జిల్లా సీతానగరం మండల పరిధిలోని స్వర్ణముఖి నదిపై నిర్మించిన తాత్కాలిక రహదారికి గండిపడింది. నదిపై ఉన్న వంతెన మరమ్మతులు

Updated : 28 Apr 2020 12:15 IST

సీతానగరం: విజయనగరం జిల్లా సీతానగరం మండల పరిధిలోని స్వర్ణముఖి నదిపై నిర్మించిన తాత్కాలిక రహదారికి గండిపడింది. నదిపై ఉన్న వంతెనకు మరమ్మతులు చేపట్టేందుకు రెండు నెలల క్రితం తాత్కాలిక రహదారి నిర్మించారు. గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రహదారి కోతకు గురైంది. ఈక్రమంలో మంగళవారం ఉదయం నది మధ్య భాగంలో రహదారి వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. దీంతో 36వ రాష్ట్ర రహదారిపై నిత్యవసర సరకులు తరలించేందుకు, అత్యవసరంగా రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఆటకంకం ఏర్పడింది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని