‘ఈనాడు’ కథనాన్ని సుమోటోగా తీసుకున్న HRC

ప్రసవం కోసం ఆరు ఆస్పత్రులు తిరిగి గర్భిణి మృతిచెందిన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం(హెచ్చార్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం యాపదిన్నెకు చెందిన జెనీలా (20) కాన్పు కోసం సుమారు 200 కి.మీ

Published : 29 Apr 2020 00:39 IST

హైదరాబాద్‌: ప్రసవం కోసం ఆరు ఆస్పత్రులు తిరిగి గర్భిణి మృతిచెందిన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం(హెచ్చార్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం యాపదిన్నెకు చెందిన జెనీలా (20) కాన్పు కోసం సుమారు 200 కి.మీ తిరిగింది. చివరకు ఆమెతో పాటు పసికందు మృతిచెందింది. జోగులాంబ గద్వాల జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో ఆ అనుమానంతోనే వైద్యులు ఆరు ఆస్పత్రులకు తమను తిప్పారని, సకాలంలో కాన్పు చేసి ఉంటే తల్లీబిడ్డలు ఇద్దరూ దక్కేవారని మహిళ భర్త మహేందర్‌ వాపోయారు. అటు భార్య, ఇటు బిడ్డను పోగొట్టుకున్న తాను ఈ శోకాన్ని ఎలా భరించేదని, బతికుండి ప్రయోజనమేంటని ఆయన ప్రశ్నించారు. ఈ దయనీయ ఘటనపై ‘ఈనాడు-ఈటీవీ’లో వచ్చిన కథనంపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం స్పందించింది. ఆ కథనాలను సుమోటోగా స్వీకరించింది. ఘటనపై జూన్‌ 16లోపు సమగ్ర నివేదిక అందించాలని కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మహబూబ్‌నగర్‌ జిల్లా వైద్యాధికారి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌, కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెట్లకు ఆదేశాలు జారీ చేసింది. 

ఇదీ చదవండి

200 కిలోమీటర్లు.. ఆరు ఆసుపత్రులు!
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని