చైనా వస్తువైతే తనిఖీ తప్పనిసరి: మంత్రి

ఎలక్ట్రానిక్స్‌ ఉపకరణాల తయారీకి పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం కల్పించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో వచ్చిన సువర్ణావకాశాన్ని అందిపుచ్చుకోవాలని వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశంలో రాష్ట్రల ఐటీ మంత్రులకు సూచించారు.....

Published : 28 Apr 2020 18:56 IST

ఎలక్ట్రానిక్స్‌ తయారీని ప్రోత్సహించాలి

రాష్ట్రాల ఐటీ మంత్రులకు రవిశంకర్‌ ప్రసాద్‌ సూచన

దిల్లీ: ఎలక్ట్రానిక్స్‌ ఉపకరణాల తయారీకి పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం కల్పించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ కోరారు కరోనా వైరస్‌ నేపథ్యంలో వచ్చిన సువర్ణావకాశాన్ని అందిపుచ్చుకోవాలని వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశంలో రాష్ట్రాల ఐటీ మంత్రులకు సూచించారు. ఇంటి నుంచి పనిచేసేందుకు కనెక్టివిటీ నిబంధనలను సులభతరం చేశామన్నారు. ఏప్రిల్‌ 30తో ముగుస్తున్న గడువును జులై 31 వరకు పొడగిస్తున్నామని వెల్లడించారు.

ప్రజలు ఆరోగ్య సేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొనేలా అవగాహన కల్పించినందుకు రాష్ట్రాలను రవిశంకర్‌ ప్రసాద్‌ అభినందించారు. ఇక నుంచి తయారయ్యే ఫీచర్‌ ఫోన్లలోనూ ఇలాంటి సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు. రెచ్చగొట్టేలా ఉన్న సమాచారాన్ని తొలగిస్తున్నామని ఆ సంస్థలు తెలియజేశాయని వివరించారు. ఏవైనా సంస్థలు నకిలీ వార్తలపై ఉదాసీనంగా వ్యవహరిస్తే కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఏ దేశం నుంచైనా వస్తువులను దిగుమతి చేసుకుంటే కఠినంగా తనిఖీలు, భద్రతా ఆడిట్‌ చేపట్టాలని రవిశంకర్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు. చైనా వస్తువులైతే మరింత జాగ్రత్తగా చేయాలి. ‘ఒక విషయం స్పష్టం. మనం ఏ దేశానికీ వ్యతిరేకం కాదు. భారత్‌కు అనుకూలం. దేశ ప్రజల కోసం అవకాశాలు సృష్టించాలి. భద్రత విషయానికి వస్తే ఏ వస్తువైనా ఇతర దేశాల నుంచి వస్తే ప్రత్యేకించి చైనా అయితే భద్రతా ఆడిట్‌, తనిఖీ తప్పనిసరి’ అని ఆయన అన్నారు.

చదవండి: తబ్లిగీలు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు

చదవండి: అమెరికాపై ప్రతిదాడికి దిగిన చైనా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని