రూ.100 కోట్ల సాయానికి ముందుకు

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ వేళ ప్రజలను ఆదుకునేందుకు దాతలు, వివిధ సంస్థలు పెద్దమనసుతో ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ శీతల పానీయాల ఉత్పత్తి సంస్థ కోకాకోలా రూ.100 కోట్ల సాయం ప్రకటించింది. 10 లక్షలకు పైగా భారతీయులకు ఉపశమనం కలగజేస్తామని చెప్పింది. ప్రజల అవసరాలు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది....

Published : 29 Apr 2020 00:01 IST

దేశవ్యాప్తంగా కార్యక్రమాలు: కోకాకోలా

న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలను ఆదుకునేందుకు దాతలు, వివిధ సంస్థలు ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ శీతల పానీయాల ఉత్పత్తి సంస్థ కోకాకోలా రూ.100 కోట్ల సాయం ప్రకటించింది. కరోనాపై పోరులో భాగంగా ప్రజల అవసరాలు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతో 10 లక్షలకు పైగా భారతీయులకు ఉపశమనం కలుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా 50 ప్రాంతాల్లో ప్రజలకు సంస్థ ఉత్పత్తులను పంపిణీ చేయనుంది. దీంతోపాటు కోకాకోలా ఫౌండేషన్‌ సహకారంతో యునైటెడ్‌ వే, కేర్‌ ఇండియా సంస్థల భాగస్వామ్యంతో వైద్య, ఆహార భద్రతా రంగాల బలోపేత కార్యక్రమాల నిర్వహణకు ఊతం అందించనున్నట్లు పేర్కొంది. ఈ సంస్థ ఇప్పటికే వారణాసి ఇతర ప్రాంతాల్లో అక్షయపాత్ర ఫౌండేషన్‌ తదితర సంస్థలతో కలిసి పనిచేస్తూ.. పేదల ఆకలి తీర్చుతోంది. పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు అందజేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని