నీ సాయం వారి గౌరవం పెంచింది:కేటీఆర్‌

రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న ఈ ఆపత్కాలంలో ఎందరో దాతలు తమకు తోచిన విధంగా పేదలు, ఉపాధి కోల్పోయిన కార్మికులకు, వలస కూలీలకు సాయం అందిస్తున్నారు. కొంత మంది నేరుగా

Updated : 28 Apr 2020 22:16 IST

సీఎం సహాయనిధికి పారిశుద్ధ్య కార్మికురాలి విరాళం


 

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న ఈ ఆపత్కాలంలో ఎందరో దాతలు తమకు తోచిన విధంగా పేదలు, ఉపాధి కోల్పోయిన కార్మికులకు, వలస కూలీలకు సాయం అందిస్తున్నారు. కొంత మంది నేరుగా ప్రజల వద్దకే వెళ్లి ప్రజలకు నిత్యావసరాలు, కూరగాయల రూపంలో ఆదుకుంటుంటే.. మరికొంత మంది సీఎం సహాయనిధికి విరాళాల రూపంలో అందిస్తున్నారు. ఇక వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విపత్కాలంలో విధులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో నగరానికి చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు అలివేలు తన పెద్దమనసును చాటుకుంది. తనకు వచ్చే నెల వేతనం రూ. 12 వేలలో ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 10 వేలను విరాళంగా అందించారు. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు విరాళానికి సంబంధించిన చెక్కును అందించారు.

కరోనాపై పోరులో తనవంతుగా సాయం చేసిన అలివేలును కేటీఆర్‌ అభినందించారు. చెక్కు స్వీకరించిన తర్వాత ఆమె కుటుంబసభ్యుల వివరాలు అడిగిన కేటీఆర్‌.. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని ఆమెకి భరోసా కల్పించారు. ఎలాంటి లాభాపేక్షను ఆశించి సాయం చేయలేదని.. కష్టకాలంలో ఉన్న ప్రజలకు తనవంతుగా సాయం చేయాలనే ఆలోచనతోనే విరాళాన్ని అందించానని ఆమె తెలిపారు. కరోనాపై పోరులో ముందు వరుసలో నిలబడి పోరాడుతున్న ప్రతిఒక్కరికీ అలివేలు చేసిన సాయం మరింత గౌరవాన్ని తీసుకొచ్చిందని మంత్రి కేటీఆర్ కొనియాడారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని