Published : 29 Apr 2020 14:44 IST

అకాల వర్షం.. అన్నదాతల అవస్థలు 


హైదరాబాద్‌ : రాష్ట్రంలో అకాల వర్షం రైతులను నిండా ముంచింది. అకస్మాత్తుగా కురిసిన వర్షానికి ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటి పాలయ్యింది. పలుచోట్ల కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకొచ్చిన ధాన్యం తడిసి పోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాంలో, సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో వడగండ్ల వానకు ధాన్యం తడిసిపోయింది. కరీంనగర్‌ మార్కెట్‌ యార్డులో నిల్వ చేసిన పంట నీటి పాలయ్యింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని వివిధ మండలాల్లో కురిసిన వర్షానికి కర్శకులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. రాజంపేటలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం తడిసిపోయింది. ఖమ్మం జిల్లా ఏనుగూరు మండలంలో గాలి దుమారానికి బొప్పాయి చెట్లు విరిగిపోయాయి. వరంగల్‌ గ్రామీణ జిల్లా గీసుకొండలో అకాల వర్షానికి మొక్కజొన్న నీటి పాలయ్యింది. నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

 


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని