పద్మావతి పరిణయోత్సవాలు వాయిదా

తిరుమలలో నిర్వహించే పద్మావతి పరిణయోత్సవాలను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తితిదే ఈవో అనిల్‌కుమార్‌ వెల్లడించారు. కరోనా దృష్ట్యా భౌతికదూరం..

Published : 29 Apr 2020 23:52 IST

తిరుమల: తిరుమలలో నిర్వహించే పద్మావతి పరిణయోత్సవాలను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తితిదే ఈవో అనిల్‌కుమార్‌ వెల్లడించారు. కరోనా దృష్ట్యా భౌతికదూరం పాటిస్తూ ఉత్సవాలను నిర్వహించడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ఆగమ సలహామండలి సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మరో ముహూర్తాన ఈ ఉత్సవాలను మళ్లీ నిర్వహిస్తామన్నారు. శ్రీవారి దర్శనాల విషయంపై మాట్లాడుతూ...మే 3 తర్వాత కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సూచన మేరకు నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని