కరోనా అవగాహనపై విశాఖ యువత పాట

ఎక్కడో చైనాలో ఉనికిలోకి వచ్చి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న కరోనా మహమ్మారిపై ఇప్పటికే ఎంతో మంది సినీ గాయకులు, రచయితలు పాటల ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్‌ బారిన పడకుండా ఇంట్లోనే ఉంటూ లాక్‌డౌన్‌ పాటించాలని..

Updated : 14 Sep 2023 15:41 IST

ఆవిష్కరించిన ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌

విశాఖ: ఎక్కడో చైనాలో ఉనికిలోకి వచ్చి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న కరోనా మహమ్మారిపై ఇప్పటికే ఎంతో మంది సినీ గాయకులు, రచయితలు పాటల ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్‌ బారిన పడకుండా ఇంట్లోనే ఉంటూ లాక్‌డౌన్‌ పాటించాలని ఎంతో మంది వారికి తోచిన విధంగా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా కరోనాపై ప్రజలను అప్రమత్తం చేయడంలో మేము సైతం అంటూ విశాఖ యువత పాట ద్వారా ముందుకొచ్చారు. ‘ఇది ఒక యుద్ధం.. కరోనాతో యుద్ధం’ అని రూపొందించిన పాట పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న కృషిని కళ్లకుకడుతోంది. విశాఖకు చెందిన సంతోష్‌ ఎడ్లప ఈ పాటను నిర్మించారు. విశాఖ నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ కేటీవీ రమేశ్‌ ఈ పాటకు సాహిత్యం, సంగీతం, గాత్రాన్ని అందించారు. ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ ఈ పాటను ఆవిష్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని