లాక్‌డౌన్‌ వారికి వరమైంది

లాక్‌డౌన్‌ శ్వాసకోశ రోగుల్లో ఆనందం నింపుతోంది. ఆస్తమా వంటి రోగులు స్వేచ్ఛగా శ్వాస తీసుకుంటున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వాతావరణంలో కాలుష్యం శాతం తగ్గిందని..

Published : 02 May 2020 00:32 IST

ప్రయాగ్‌రాజ్‌ (యూపీ‌): లాక్‌డౌన్‌ శ్వాసకోశ రోగుల్లో ఆనందం నింపుతోంది. ఆస్తమా వంటి రోగులు స్వేచ్ఛగా శ్వాస తీసుకుంటున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వాతావరణంలో కాలుష్య శాతం తగ్గిందని, దీంతో శ్వాస సంబంధిత రోగులకు సాంత్వన లభిస్తోందని ప్రముఖ ఛాతీ వైద్యుడు డాక్టర్‌ డీఎన్‌ కేసర్‌వాని వెల్లడించారు. లాక్‌డౌన్‌ సమయంలో ఆస్తమా వంటి రోగులు చాలా తక్కువ సమస్యలు ఎదుర్కొటున్నారని పేర్కొన్నారు.

‘వాతావరణంలో మార్పు కారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో శ్వాసకోశ సంబంధిత రోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పెరుగుతాయి. కానీ లాక్‌డౌన్‌ కారణంగా వాతావరణంలో కాలుష్య స్థాయిలు తగ్గిపోయాయి. దీంతో దగ్గు, జలుబు కేసులు కూగా తగ్గుముఖం పట్టాయి. ఈ మధ్యే పలువురు రోగులతో మాట్లాడాను. వారిలో కొందరు మందులు తీసుకోవడం మానేశారు. అయినా ఎలాంటి సమస్యలు ఎదుర్కోవడం లేదు. లాక్‌డౌన్ ఈ తరహా కేసులను తగ్గించింది’ అని కేసర్‌వాని పేర్కొన్నారు.

‘‘చాలా ఏళ్లుగా ఆస్తమాతో బాధపడుతున్నా. లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు నేను నా వ్యాధికి సంబంధించిన మందులు వాడటం లేదు. అయినా ఎలాంటి ఇబ్బందులు పడటం లేదు. కాలుష్యం కారణంగా శ్వాస తీసుకోవడంలో ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోయినట్లుగానే భావిస్తున్నా’ అని ఆనందం వ్యక్తం చేశాడు ఏళ్లుగా ఆస్తమాతో బాధపడుతున్న ఓ రోగి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు