Published : 02/05/2020 18:36 IST

‘లాక్‌డౌన్‌ ఎప్పుడు ముగుస్తుందో చెప్పాలి’

ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించాలి: కాంగ్రెస్‌

న్యూదిల్లీ: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకవైపు కరోనా, మరోవైపు ఇబ్బందికర ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. ఈ సమయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ముందుకు రావాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మీడియాతో మాట్లాడారు. దేశంలో లాక్‌డౌన్‌ ఎప్పుడు ముగుస్తుందో తెలపాలని ప్రధానిని డిమాండ్‌ చేశారు. లాక్‌డౌన్‌ ఉపసంహరణ వ్యూహాలనూ రూపొందించాలన్నారు. కరోనా, ఆర్థిక రంగం నిర్వహణపై నిర్ణయాలను వెల్లడించాలని విజ్ఞప్తి చేశారు. ఈ తరుణంలో ప్రధాని ముందుకు వచ్చి జాతినుద్దేశించి ప్రసంగించాలని కోరారు. వలస కార్మికుల విషయంలో కేంద్రం మానవత్వంతో వ్యవహరించడం లేదని ఆరోపించారు. శానిటైజ్‌ చేసిన రైళ్లలో వారిని ఉచితంగా ఇళ్లకు తరలించాలని విజ్ఞప్తి చేశారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని