కూరగాయల కొట్టుగా మారిన నగల దుకాణం

పాతికేళ్ల పాటు నగల వ్యాపారం చేసిన వ్యాపారి తన దుకాణంలో కూరగాయలు అమ్ముకోవాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదేమో. అందంగా తయారుచేసి ఉంచిన బంగారు ఆభరణాల స్థానంలో..

Published : 03 May 2020 01:20 IST

కుటుంబాన్ని పోషించేందుకు వ్యాపారి తంటాలు

జైపుర్‌: పాతికేళ్ల పాటు నగల వ్యాపారం చేసిన అతను దుకాణంలో కూరగాయలు అమ్ముకోవాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదేమో. అందంగా తయారుచేసి ఉంచిన బంగారు ఆభరణాల స్థానంలో పచ్చని కూరగాయలు ఉంచి విక్రయించాల్సి వస్తుందని ఊహించి ఉండడేమో.. ఆదాయం లేక, పూట గడవక కుటుంబాన్ని పోషించుకునేందుకు ఓ చిరు నగల వ్యాపారి తన దుకాణాన్ని కూరగాయల కొట్టుగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాక్‌డౌన్‌ ఫలితంగా రాజస్థాన్‌ రాష్ట్ర రాజధాని జైపుర్‌లోని రామ్‌నగర్‌లో జీపీ జ్యుయలరీ‌ దుకాణం కూరగాయల కొట్టుగా మారిపోయింది. ఇదివరకు బంగారు గొలుసులు, ఉంగరాలు అమ్మిన యజమాని గత నాలుగు రోజులుగా ఆలుగడ్డలు, టమోటాలు తదితర కూరగాయలను విక్రయిస్తున్నాడు. 

దుకాణం యజమాని హుకుమ్‌చంద్‌ సోని మాట్లాడుతూ.. ‘నేను ఇదివరకు చిన్నపాటి బంగారు ఆభరణాలను అమ్ముతూ, దెబ్బతిన్న వాటికి మరమ్మతులు చేస్తూ ఆదాయం పొందేవాడిని. లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 25వ తేదీ నుంచి నా నగల దుకాణాన్ని మూసిఉంచాల్సి వస్తోంది. దీంతో ఆదాయం లేకుండా పోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో నా కుటుంబాన్ని పోషించేందుకు ఉన్న ఏకైక మార్గం నా దుకాణాన్ని కూరగాయల కొట్టుగా మార్చడమే. ఇప్పుడు ఎంతో కొంత సంపాదిస్తున్నా. దుకాణానికి కిరాయి చెల్లించాలి. నా తల్లిని, చనిపోయిన నా తమ్ముడి కుటుంబాన్ని పోషించాలి. ఏ పనీ చేయకుండా ఇంట్లో కూర్చుంటే పూట గడవదు కదా..’ అంటూ ఆవేదన వెల్లగక్కాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని