‘దృఢ’సంకల్పం

వ్యాయామంతోనే.. దృఢత్వం కలదోయ్‌... అంటున్నారు అంతర్జాతీయ పవర్‌ లిఫ్టింగ్‌ క్రీడాకారిణి అక్షతా పూజారి. లాక్‌డౌన్‌ సమయంలో శరీర దృఢత్వాన్ని (ఫిట్‌నెస్‌) కాపాడుకునేందుకు

Updated : 03 May 2020 08:20 IST

   ఫిట్‌నెస్‌ కోసం బావి తవ్వకం

వ్యాయామంతోనే.. దృఢత్వం కలదోయ్‌... అంటున్నారు అంతర్జాతీయ పవర్‌ లిఫ్టింగ్‌ క్రీడాకారిణి అక్షతా పూజారి. లాక్‌డౌన్‌ సమయంలో శరీర దృఢత్వాన్ని (ఫిట్‌నెస్‌) కాపాడుకునేందుకు ఆమె బావి తవ్వకం చేపట్టారు. కర్ణాటకలోని ఉడుపి జిల్లా కార్కళ తాలూకా బోళ గ్రామానికి చెందిన ఈమె ప్రస్తుత సమయంలో ఇంటి ప్రాంగణంలో 25 అడుగుల లోతు బావిని తవ్వారు. ఏప్రిల్‌ 16న తవ్వకం ప్రారంభించారు. నీరు రాకపోయేసరికి నిరాశ చెందారు. గత నెల 24న సాయంత్రం పనిని చాలిద్దామని అనుకుంటున్న సమయంలో భూమి చెమ్మగా కనిపించింది. పట్టుదలతో తవ్వగా పాతాళగంగ పెల్లుబికినట్లు అక్షతా పూజారి పేర్కొన్నారు. నీరు వచ్చే సమయంలో తన సోదరుడు, ఇతరులు సహకరించారని ఆమె తెలిపారు.

- న్యూస్‌టుడే, ఉడుపి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని