టోలిచౌకి వంతెన వద్ద వలసకూలీల ఆందోళన

నగరంలోని మెహదీపట్నం, టోలిచౌకి ప్రాంతాల్లో నివససిస్తున్న కూలీలు తమను సొంత ప్రాంతాలకు పంపాలంటూ ఆందోళనకు దిగారు. రాజస్థాన్‌, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లేందుకు సుమారు 1000 మందికిపైగా టోలిచౌకి వంతెన వద్దకు చేరుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో వారంతా ఆందోళనకు

Updated : 03 May 2020 20:31 IST

హైదరాబాద్‌: నగరంలోని మెహదీపట్నం, టోలిచౌకి ప్రాంతాల్లో నివససిస్తున్న కూలీలు తమను సొంత ప్రాంతాలకు పంపాలంటూ ఆందోళనకు దిగారు. రాజస్థాన్‌, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లేందుకు సుమారు 1000 మందికిపైగా టోలిచౌకి వంతెన వద్దకు చేరుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో వారంతా ఆందోళనకు దిగారు. కూలీల ఆందోళనతో వెస్ట్‌జోన్‌ డీసీపీ శ్రీనివాస్‌ అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వలస కూలీల ఆకలి బాధలు తీర్చేందుకు జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌తో చర్చించి టోలిచౌకి ప్రాంతంలో 5 అన్నపూర్ణ క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు డీసీపీ చెప్పారు. కూలీలు సమీపంలోని పోలీస్‌స్టేషన్లకు వెళ్లి తమ వివరాలు నమోదు చేసుకోవాలని.. ఆ వివరాలను ప్రభుత్వానికి అందజేసి ప్రయాణ ఏర్పాట్లు చేస్తామని చెప్పడంతో వారంతా ఆందోళన విరమించారు. 

 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని