కరోనా ఎఫెక్ట్‌: ఫస్ట్‌నైట్‌.. జస్ట్‌ వెయిట్‌!

మరికాసేపట్లో పెళ్లి అనగా.. పోలీసులు వచ్చి ‘ఆపండి’ అంటూ వివాహలు ఆపడం పాత సినిమాల్లో చూసే ఉంటాం. సరిగ్గా అలాంటి సంఘటనే కర్ణాటకలో..

Published : 04 May 2020 02:18 IST

బెంగళూరు: మరికాసేపట్లో పెళ్లి అనగా.. పోలీసులు వచ్చి ‘ఆపండి’ అంటూ వివాహలు ఆపడం పాత సినిమాల్లో చూసే ఉంటాం. సరిగ్గా అలాంటి సంఘటనే కర్ణాటకలో జరిగింది. కాకపోతే సీన్లో కొంచెం ఛేంజ్‌. ఈ సారి పెళ్లి కాదు ఆ నూతన వధూవరులకు తొలిరాత్రి. వచ్చింది పోలీసులు కాదు అధికారులు! ఇంకేముంది ఫస్ట్‌నైట్‌కు బ్రేక్‌ పడింది. వరుడితో పాటు పెళ్లికి హాజరైన 26 మందిని హోం క్వారంటైన్‌ వాసం పడింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో చాలా వరకు పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నారు. మరికొందరు నిరాడంబరంగా తంతు కానిచేస్తున్నారు. ఇలానే కర్ణాటక ఉడుపి జిల్లాలో కుత్యూరులో వివాహం జరిగింది. అనంతరం యువకుడు తన స్వగ్రామం బోలాకు పెళ్లికూతురితో చేరుకున్నాడు. అయితే సదరు యువకుడు పెళ్లి కోసం మంగళూరు నుంచి స్వగ్రామానికి వచ్చాడని సమాచారం తెలుసుకున్న ఆరోగ్యశాఖ అధికారులు అతడిని ఇంటికి చేరుకున్నారు. క్వారంటైన్‌కు తరలించారు. పెళ్లికి హాజరైన 26 మందినీ హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు అధికారులు.

ఇవీ చదవండి..
లాక్‌డౌన్‌ వేళ.. పెళ్లి కోసం ఎన్ని తిప్పలో!
1200కి.మీ సైకిల్‌పై ప్రయాణం..మధ్యలోనే..!

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని