గంజ్‌ కారణంగానే వనస్థలిపురంలో కొవిడ్‌ కేసులు

నగరంలోని వనస్థలిపురంలో కరోనా కలకలంతో అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తమైంది. వనస్థలిపురంలో నివసించే మూడు కుటుంబాల్లో పదకొండు...

Updated : 04 May 2020 10:44 IST

ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి

వనస్థలిపురం: నగరంలోని వనస్థలిపురంలో కరోనా కలకలంతో అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తమైంది. వనస్థలిపురంలో నివసించే మూడు కుటుంబాల్లో పదకొండు మందికి కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో ఆ ప్రాంతంలో కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించిన ఎస్‌కేడీనగర్‌, ఏ, బీ టైపు క్వార్టర్స్‌, ఫేజ్‌-1, హుడాసాయినగర్‌లోని కొన్ని వీధుల్లో అధికారులు వైరస్‌ నివారణ చర్యలు చేపట్టారు. కొవిడ్‌ ప్రభావిత ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. వీధుల్లో హైపోక్లోరైడ్‌ ద్రావణం పిచికారీ చేసి ఆరోగ్య సర్వే చేపట్టారు. 
మరోవైపు కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి సోమవారం పర్యటించారు. కాలనీల్లో చేపడుతున్న వైరస్‌ నివారణ చర్యలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... గత వారం రోజుల వరకు హయత్‌నగర్‌ డివిజన్‌లో జీరో పాజిటివ్‌ కేసులు ఉన్నాయన్నారు. దురదృష్టవశాత్తు మలక్‌పేట్‌లోని గంజ్‌ కారణంగా వనస్థలిపురం పరిధిలో కరోనా కలకలం రేపిందని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారణంగా స్థానికులంతా భయబ్రాంతులకు గురవుతున్నారన్నారు. ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని.. వైరస్‌ నివారణకు అధికారులు చర్యలు చేపట్టారని చెప్పారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలెవరూ బటయకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి..
సూర్యాపేట నుంచి వనస్థలిపురానికి
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని