ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

వనస్థలిపురంలో కరోనా కలకలంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎనిమిది కాలనీలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించి వారం రోజుల పాటు ప్రజలెవరూ బయటకు రావొద్దని సూచించారు.

Published : 04 May 2020 18:48 IST

జిల్లా ఉప వైద్యాధికారి బీమానాయక్‌ 

హైదరాబాద్‌: వనస్థలిపురంలో కరోనా కలకలంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎనిమిది కాలనీలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించి వారం రోజుల పాటు ప్రజలెవరూ బయటకు రావొద్దని సూచించారు. ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ వివరాలు సేకరిస్తున్నారు. హైపో క్లోరైడ్‌ ద్రావణాన్ని వీధుల్లో పిచికారీ చేస్తున్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో అక్కడ ఎలాంటి చర్యలు చేపడుతున్నారో జిల్లా ఉప వైద్యాధికారి బీమానాయక్‌ మాటల్లో...

వనస్థలిపురంలో ప్రస్తుత పరిస్థితులెలా ఉన్నాయి..? ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..?
ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి పర్యవేక్షిస్తున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే సమాచారం అందించాలని స్థానికులకు ఫోన్‌ నంబర్లు ఇచ్చాం. 102 నంబర్‌కు ఫోన్‌ చేసినా వెంటనే వైద్యులను పంపి వైద్య పరీక్షలు జరిగేలా చూస్తాం. 

మొత్తం ఎన్ని కేసులు ఇక్కడ నమోదయ్యాయి..? ఇంకా ఎంతమందికి పరీక్షలు నిర్వహించనున్నారు..?
హయత్‌నగర్‌, వనస్థలిపురంలో మొత్తం పది కరోనా పాజిటివ్‌ కేసులు, మునుగునూరు మున్సిపాలిటీ పరిధిలో ఒక పాజిటివ్‌ కేసు నమోదైంది. వీరి ప్రైమరీ కాంటాక్ట్స్‌ను గుర్తించి పరీక్షలకు పంపగా.. అందరికీ నెగటివ్‌ వచ్చింది. ఒక్క కుటుంబంలో మాత్రమే కొన్ని పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. స్థానికులు భయాందోళన చెందాల్సిన అసరం లేదు. మరో 14 రోజుల వరకు క్షేత్రస్థాయిలోనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తుంటాం.
మరిన్ని వివరాలు కింది వీడియోలో చూడండి.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని