బెంగాల్‌లోనే మరణాల రేటు ఎక్కువ

దేశంలో కరోనా మరణాల రేటు పశ్చిమ బెంగాల్‌లోనే అత్యధికంగా ఉన్నట్లు రాష్ట్రంలో పర్యటించిన అంతర్‌ మంత్రిత్వ కేంద్ర బృందం (ఐఎంసీటీ) వెల్లడించింది. బృందానికి నేతృత్వం........

Published : 04 May 2020 22:12 IST

పశ్చిమ బెంగాల్‌ సీఎస్‌కు కేంద్ర బృందం లేఖ

కోల్‌కతా: దేశంలో కరోనా మరణాల రేటు పశ్చిమ బెంగాల్‌లోనే అత్యధికంగా ఉన్నట్లు రాష్ట్రంలో పర్యటించిన అంతర్‌ మంత్రిత్వ కేంద్ర బృందం (ఐఎంసీటీ) వెల్లడించింది. బృందానికి నేతృత్వం వహించిన అపూర్వచంద్ర.. రాష్ట్ర సీఎస్‌ రాజీవ సిన్హాకి తమ పరిశీలన అంశాలను లేఖ ద్వారా వివరించారు. కరోనా మరణాల రేటు రాష్ట్రంలో 12.8 శాతంగా ఉందన్నారు. తక్కువ సంఖ్యలో వైరస్‌ నిర్ధారణ పరీక్షలు, బలహీనమైన పర్యవేక్షణ, ట్రాకింగ్‌ వ్యవస్థను ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని అందులో పేర్కొన్నారు. మెడికల్ బులెటిన్లలో రాష్ట్రం నివేదించిన కేసుల సంఖ్య, కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన లెక్కల్లో వ్యత్యాసం కనిపిస్తోందన్నారు. ఈ కేంద్ర బృందం కోల్‌కతాలో రెండు రోజులపాటు పర్యటించి.. సోమవారం దిల్లీకి తరలివెళ్లింది. కరోనా కట్టడి చర్యలను పరిశీలించేందుకు దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ కేంద్ర బృందాలు పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని