ఆరు వేళ్లకు ఆ జన్యువే కారణం

కొంతమంది చేతులు, కాళ్లకు ఆరు వేళ్లు ఉండటం గమనించే ఉంటాం. ఇలా ఎందుకు జరుగుతుందనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. తాజాగా సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ ..

Updated : 05 May 2020 08:47 IST

సీడీఎఫ్‌డీ శాస్త్రవేత్త అశ్విన్‌దలాల్‌
  పరిశోధన పత్రంలో వెల్లడి

హైదరాబాద్‌: కొంతమంది చేతులు, కాళ్లకు ఆరు వేళ్లు ఉండటం గమనించే ఉంటాం. ఇలా ఎందుకు జరుగుతుందనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. తాజాగా సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నసిస్‌(సీడీఎఫ్‌డీ) శాస్త్రవేత్త అశ్విన్‌ దలాల్‌ దీనికి కారణం కనుగొన్నారు. దీనికి సంబంధించి ఆయన రాసిన పరిశోధన వ్యాసం అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ జెనిటిక్స్‌లో ప్రచురితమైంది. తన బృందంతో కలిసి అశ్విన్‌ దలాల్‌ కొంతకాలంగా దీనిపై పరిశోధన చేస్తున్నారు. బీహెచ్‌ఎల్‌హెచ్‌ఎ9 అనే జన్యువు పరివర్తన చెందడమే ఆరు వేళ్లు ఏర్పడడానికి కారణమని, సమీప బంధువులను వివాహాలు చేసుకుంటే దీనికి అవకాశం ఉంటుందని ఆయన పరిశోధనలో వెల్లడైంది. ఈ ఆవిష్కరణ ద్వారా భవిష్యత్తులో ముందుగానే జన్యు పరీక్షలు నిర్వహించి పుట్టే పిల్లల్లో ఈ లోపం సరిదిద్దడానికి అవకాశం ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని