
వైకాపా నేత హడావుడిపై ఎస్పీ ఆగ్రహం
గుంటూరు: గుంటూరు నగరంలోని నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో వైకాపా నేత హడావుడిపై అర్బన్ జిల్లా ఎస్పీ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై డీఎస్పీ కమలాకర్‌ను పోలీస్‌స్టేషన్‌కు పంపించి విచారణ జరిపించారు. ఆయన ఇచ్చిన నివేదిక మేరకు ఓ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. ఘటన జరిగిన విషయం తన దృష్టికి తీసుకురాకపోవటంపై నల్లపాడు సీఐకి ఛార్జిమెమో ఇచ్చారు. గత కొద్ది రోజులుగా స్టేషన్లో సదు వ్యక్తి చేస్తున్న పైరవీలపైనా విచారణ జరిపించారు. అతనితో చనువుగా ఉండటంతో పాటు డబ్బులు తీసుకున్నట్టు తేలడంతో ఓ కానిస్టేబుల్‌ను వీఆర్‌కు పంపారు. స్టేషన్లో హడావుడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఆదేశాల మేరకు అతన్ని రిమాండ్‌కు పంపించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.