
తెలంగాణలో మద్యం నిల్వలపై ఆరా
హైదరాబాద్: తెలంగాణలో మద్యం నిల్వలపై ఎక్సైజ్ శాఖ ఆరా తీస్తోంది. మద్యం దుకాణాల్లో నిల్వలు ఏ మేరకు ఉన్నాయో పరిశీలించాలని ఎక్సైజ్ స్టేషన్ల ఇంఛార్జ్‌లను అబ్కారీ శాఖ కమిషనర్ ఆదేశించారు. మద్యం దుకాణాలు తెరుచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మద్యం నిల్వలపై అబ్కారీశాఖ వివరాలు సేకరిస్తోంది. ఆ మేరకు ఎక్సైజ్ స్టేషన్ల ఇంఛార్జ్‌ల ద్వారా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్లు దుకాణాల వారీగా వివరాలు సేకరిస్తున్నారు. సాయంత్రంలోగా దుకాణాల వారీగా లిక్కర్, బీరు నిల్వలపై ఎక్సైజ్ స్టేషన్ల ఇంఛార్జ్‌లు నివేదిక సమర్పించాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.