తెలంగాణలో పరీక్షలు లేకుండానే పైతరగతులకు

కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ అమల్లోకి రావడంతో విద్యా సంవత్సరం ముగియకుండానే రాష్ట్రంలోని పాఠశాలలు మూతపడిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులను ప్రభుత్వం తదుపరి తరగతులకు

Published : 05 May 2020 17:13 IST

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ అమల్లోకి రావడంతో విద్యా సంవత్సరం ముగియకుండానే రాష్ట్రంలోని పాఠశాలలు మూతపడిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులను ప్రభుత్వం తదుపరి తరగతులకు ప్రమోట్‌ చేసింది. పరీక్షలు లేకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వుల జారీ చేసింది. గత మంత్రివర్గ సమావేశంలో మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం మేరకు విద్యార్థులను ప్రమోట్‌ చేస్తూ ఉత్తర్వుల జారీ చేసినట్లు విద్యా శాఖ ప్రకటనలో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని