ఏపీలో ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు

రాష్ట్రంలో నిర్వహించనున్న ప్రవేశ పరీక్షల తేదీలను ప్రభుత్వం ఖరారు చేసింది. ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌ పరీక్షల తేదీలను ప్రకటించింది. జులై 27 నుంచి 31 వరకు ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటనలో తెలిపింది. జులై 24న

Updated : 06 May 2020 17:45 IST

అమరావతి: రాష్ట్రంలో నిర్వహించనున్న ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌, పీజీఈసెట్‌, ఎడ్‌సెట్‌, లాసెట్‌, పీజీఈసెట్‌ (ఫీల్డ్‌ టెస్ట్‌) పరీక్షల తేదీలను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. జులై 27 నుంచి 31 వరకు ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటనలో తెలిపింది. జులై 24న ఈసెట్‌, జులై 25న ఐసెట్‌ పరీక్షలు జరగనున్నాయి. ఆగస్టు 2 నుంచి ఆగస్టు 4 వరకు పీజీఈసెట్‌, ఆగస్టు 5న ఎడ్‌సెట్‌, ఆగస్టు 6న లాసెట్‌, ఆగస్టు 7 నుంచి ఆగస్టు 9 వరకు పీజీఈసెట్‌ (ఫీల్డ్‌ టెస్టు) పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని