టీఎస్‌ సీఎంఆర్‌ఎఫ్‌కి సింగరేణి భారీ విరాళం

కరోనా కట్టడి చర్యలకుగాను తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. కరోనా నివారణ చర్యలకు మద్దతుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ రూ.40 కోట్లు విరాళాన్ని

Published : 06 May 2020 18:57 IST

హైదరాబాద్‌: కరోనా కట్టడి చర్యలకుగాను తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోవడానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతులగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ రూ.40 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ మేరకు సింగరేణి కాలరీస్‌ సీఎండీ శ్రీధర్ ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. కరోనా మహమ్మారిపై పోరులో తెలంగాణ ప్రభుత్వానికి లలితా జ్యువెలర్స్‌ రూ. కోటి విరాళం అందించింది. ఈ చెక్కును సీఎం కేసీఆర్‌కు లలితా జ్యువెలర్స్‌ సీఎండీ కిరణ్ ‌కుమార్‌ అందజేశారు. ఏపీ, తమిళనాడుకు చెరో రూ. కోటి విరాళం ఇవ్వనున్నట్లు లలితా జ్యువెలర్స్‌ సీఎండీ కిరణ్ ‌కుమార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని