Published : 08/05/2020 02:10 IST

భయం గుప్పిట్లో ఆర్‌.ఆర్‌ వెంకటాపురం

విశాఖపట్నం: ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీక్‌ అవడంతో విశాఖ నగరం ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అయింది. నగరంలోని ఆర్‌.ఆర్‌.వెంకటాపురం పరిధిలో ఉన్న ఈ పరిశ్రమ నుంచి 3 కి.మీ మేర వాయువు వ్యాపించింది. తెల్లవారుజామున 3గంటల సమయంలో గ్యాస్‌ లీక్‌ అవడంతో ఆసమయంలో అందరూ నిద్రమత్తులో ఉన్నారు. రసాయన వాయువు ప్రభావంతో ఉక్కిరి బిక్కిరి అయిన స్థానికులు రోడ్లపైకి పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈక్రమంలో కొందరు అపస్మారక స్థితికి చేరుకుని రోడ్లపైనే పడిపోయారు. ఇంట్లో నుంచి బయటకు పరుగెత్తే క్రమంలో గంగరాజు అనే వ్యక్తి బావిలో పడి మృతి చెందాడు. మరికొందరు బయటకు రాలేక ఇళ్లలోనే ఉండిపోయారు. పరిశ్రమకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించారు. రసాయన వాయువు పీల్చి నురగలు కక్కుతూ పశువులు నేలకొరిగాయి. వందలాది పశువులు మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు.

ఎన్‌డీఆర్‌ఎఫ్‌,ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఆర్‌.ఆర్‌.వెంకటాపురం గ్రామానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. రసాయన వాయువు పీల్చి ఎంత మంది ఇళ్లలో ఉండిపోయారో తెలియడంలేదు. వారి పరిస్థితి ఎలా ఉందనే దానిపై ఆరాతీస్తున్నారు. తలుపులు పగులగొట్టి ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. సాయంత్రానికి బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఐదుగురు, వెంకటాపురంలో ముగ్గురు మృతి చెందారు.  


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని