విశాఖ ఘటనపై కేంద్ర హోంశాఖ ఆరా

విశాఖపట్నం సమీపంలోని ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలో ఎల్‌జీ పాలీమర్స్‌ పరిశ్రమ నుంచి గ్యాస్‌ లీక్‌ అయిన ఘటనపై కేంద్ర హోంశాఖ స్పందించింది

Published : 07 May 2020 09:49 IST

దిల్లీ: విశాఖపట్నం సమీపంలోని ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలో ఎల్‌జీ పాలీమర్స్‌ పరిశ్రమ నుంచి గ్యాస్‌ లీక్‌ అయిన ఘటనపై కేంద్ర హోంశాఖ స్పందించింది. ఘటనకు సంబంధించి హోంశాఖ అధికారులు జిల్లా అధికారుల నుంచి వివరాలు అడిగితెలుసుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి .. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌తో మాట్లాడి సహాయక చర్యలపై ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను విశాఖ పంపాలని సూచించారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వెంకటాపురం ఘటనకు సంబంధించి హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లాతో  మాట్లాడారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను విశాఖ పంపామని, ఏపీ అధికారులతో సంప్రదించి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నామని ఈసందర్భంగా అజయ్‌ భల్లా ..ఉప రాష్ట్రపతికి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని