విశాఖ ఘటనలో హృదయవిదారక విజువల్స్‌

సాగరతీరంలో చల్లగాలిని పీల్చే ఆ జనం ఒక్కసారిగా విషవాయువు బారిన పడ్డారు. ఓ కెమికల్‌ ఫ్యాక్టరీ నుంచి ప్రమాదవశాత్తు రసాయన వాయువు లీక్‌ అవడంతో ఆ చుట్టుపక్కల ఉండే ప్రజలు అస్వస్థతకు గురయ్యారు....

Updated : 07 May 2020 12:36 IST

విశాఖ: సాగరతీరంలో చల్లటిగాలి పీల్చే ఆ జనం ఒక్కసారిగా విషవాయువు బారిన పడ్డారు. ఓ పరిశ్రమ నుంచి ప్రమాదవశాత్తు రసాయన వాయువు లీక్‌ అవడంతో ఆ చుట్టుపక్కల ఉండే ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. విషవాయువు కారణంగా అపస్మారక స్థితిలోకి చేరిన తమ చిన్నారులను రక్షించుకునేందుకు తల్లిదండ్రులు ఆస్పత్రి వైపు పరుగులు పెట్టారు. పచ్చని చెట్లు మాడిపోయాయి. వందలాది మూగజీవాలు నేలకొరిగాయి. ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలోని ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమలో చోటుచేసుకున్న ఈ భారీ ప్రమాదంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఉల్కిపడ్డారు. విషవాయువు కారణంగా ఇప్పటికే 8మంది మృతిచెందగా, మరో 200 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషాద ఘటనకు సంబంధించి హృదయవిదాకరమైన విజువల్స్‌ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారు.





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని