కేంద్ర బృందానికి తప్పుడు నివేదిక

కొవిడ్‌ పరిస్థితులను తెలుసుకోవడానికి రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందానికి కొందరు వైద్యులు తప్పుడు నివేదిక ఇచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ఆరోపించింది. డాక్టర్స్‌ ఫర్‌ సేవా సంస్థకు చెందిన వైద్యులు కేంద్ర బృందానికి వైద్య పరీక్షలు సహా పలు అంశాలపై సుదీర్ఘ లేఖ పంపారని......

Published : 07 May 2020 22:45 IST

హైదరాబాద్‌ : కొవిడ్‌ పరిస్థితులను తెలుసుకోవడానికి రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందానికి కొందరు వైద్యులు తప్పుడు నివేదిక ఇచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ఆరోపించింది. డాక్టర్స్‌ ఫర్‌ సేవా సంస్థకు చెందిన వైద్యులు కేంద్ర బృందానికి వైద్య పరీక్షలు సహా పలు అంశాలపై సుదీర్ఘ లేఖ పంపారని.. దీనితో తమకు ఎలాంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. కొవిడ్ చికిత్సలు చేస్తున్న సమయంలో తాము ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం లేదని సంఘం నేతలు తెలిపారు. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో కరోనా పరీక్షలు జరుగుతున్నట్లు తెలిపారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు