పాలు ఇలా కూడా పోస్తారా..!

కరోనా వైరస్‌ విజృంభణతో ప్రజల జీవనశైలిలో మార్పులు చోటుచేసుకున్నాయి. వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా లాక్‌డౌన్‌ విధించడంతో ఇళ్లకే పరిమితమయ్యారు. నిత్యావసర సరకులు, పాలు, కూరగాయల విక్రయాల వద్ద మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి......

Published : 09 May 2020 01:31 IST

వ్యాపారి వినూత్న ఆలోచన.. ఫొటో వైరల్‌ 

న్యూదిల్లీ: కరోనా వైరస్‌ విజృంభణతో ప్రజల జీవనశైలిలో మార్పులు చోటుచేసుకున్నాయి. నిత్యావసర సరకులు, పాలు, కూరగాయల విక్రయాల వద్ద మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఓ పాల వ్యాపారి వినూత్నంగా ఆలోచించాడు. పాలు పోసే సమయంలో కూడా భౌతికదూరం పాటించేలా ఉపాయం ఆలోచించాడు. ఓ పైపునకు గరాట జోడించి పాల క్యాన్లతోపాటు బైక్‌కు దాన్ని అమర్చుకున్నాడు. మాస్కు, చేతులకు గ్లౌజులు ధరించి ద్విచక్రవాహనంపై కూర్చొనే పాలు పోస్తున్నాడు. భౌతిక దూరం పాటించేందుకు ఇది ఓ చక్కటి ఉపాయమని అతడి వద్ద పాలు కొనుగోలు చేస్తున్న  వినియోగదారులు మెచ్చుకుంటున్నారు.  దీనికి సంబంధించిన ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఐఏఎస్‌ అధికారి నితిన్‌ సంగ్వాన్‌ ట్విటర్‌లో ఈ ఫొటో పోస్ట్‌ చేశారు. పాల వ్యాపారి ఆలోచనను మెచ్చుకున్నారు. ‘కొందరు వ్యక్తులు తమను, తమ చుట్టూ ఉన్న వారిని సురక్షితంగా ఉంచడానికి వినూత్నంగా ఆలోచించడం సంతోషంగా ఉంది. ఇళ్లలో ఉన్నప్పటికీ కాస్త జాగ్రత్తగా ఉందాం. ఈ పాల వ్యాపారిలా బయటికి వెళ్లాల్సిన అవసరం లేకపోయినా.. మాస్కు ధరించి, కనీస భౌతిక దూరం పాటిద్దాం’ అని పేర్కొన్నారు. ఈ ఫొటోకు నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. ‘సృజనాత్మకత, పాల వ్యాపారికి కుడోస్‌, ఇతరుల గురించి కూడా ఆలోచిస్తున్న ఈ వ్యక్తికి హ్యాట్సాఫ్‌, ఇది నిజంగా గొప్ప ఆలోచన, ప్రజల్లో అవగాహన ఏర్పడటం ఆనందంగా ఉంది..’ అని రకరకాల పోస్ట్‌లు చేశారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు మాత్రం తెలియరాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని