సీబీఎస్‌ఈ పరీక్షల కొత్త తేదీలొచ్చేశాయ్!

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణతో వాయిదా పడిన సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల పరీక్షల కొత్త తేదీలను కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రకటించింది.......

Published : 08 May 2020 18:39 IST

దిల్లీ: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల విద్యార్థులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న నిర్ణయం వచ్చేసింది. కరోనా మహమ్మారి విజృంభణతో వాయిదా పడిన సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల పరీక్షల కొత్త తేదీలను కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రకటించింది. జులై 1 నుంచి 15 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్ వీడియో సందేశం ద్వారా వెల్లడించారు. పరీక్షలకు సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్టు తెలిపారు. అయితే, ఫలితాలు ఎప్పుడు వెలువరిస్తారనే దానిపై మాత్రం నోటిఫికేషన్‌ ఇవ్వలేదు.

కరోనా ప్రభావంతో లాక్‌డౌన్‌ విధించడంతో 29 సబ్జెక్టుల పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు మార్చి 25న అధికారులు ప్రకటించారు. అయితే, పలు రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఇటీవల మంత్రి రమేశ్‌పోఖ్రియాల్‌ స్పష్టతనిచ్చారు. కేవలం ఈశాన్య దిల్లీలో శాంతిభద్రతల కారణంగా పరీక్షలు రాయలేకపోయిన విద్యార్థుల కోసం మాత్రం ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు