కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ బిల్లా అరెస్టు

ఆయుధాల స్మగ్లింగ్‌లో ఆరితేరిన కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ బల్జీందర్‌ సింగ్‌ అలియాస్‌ బిల్లా మండియాలా, అతడి ముఠాలోని మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు...

Updated : 09 May 2020 09:05 IST

చండీగఢ్‌: ఆయుధాల స్మగ్లింగ్‌లో ఆరితేరిన కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ బల్జీందర్‌ సింగ్‌ అలియాస్‌ బిల్లా మండియాలా, అతడి ముఠాలోని మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కపుర్తలా జిల్లాలోని సుల్తాన్‌పుర్‌ లోఢి ప్రాంతంలో వీరిని అరెస్టు చేసి భారీయెత్తున అత్యాధునిక ఆయుధాలను స్వాధీనం చేకున్నట్టు డీజీపీ దిన్‌కర్‌ గుప్త చెప్పారు. బిల్లా...పాకిస్థాన్‌ నుంచి అత్యాధునిక విదేశీ మారణాయుధాలను అక్రమంగా తీసుకురావడాన్నే వృత్తిగా పెట్టుకున్నాడు. ఖలిస్థాన్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌, ఖలిస్థాన్‌ జిందాబాద్‌ ఫ్రంట్‌ల అధినేతలతో అతడికి సంబంధాలు ఉన్నాయి. హత్యలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా సహా పలు నేరాలకు సంబంధించి 18 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.  స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో రెండు డ్రమ్‌ మెషీన్‌ గన్లు, జర్మనీలో తయారైన మూడు ఎస్‌ఐజీ సౌవెర్‌ పిస్టళ్లు ఉన్నాయి. ఇలాంటి పిస్టళ్లను అమెరికా సీక్రెట్‌ సర్వీసు ఏజెంట్లు ఉపయోగిస్తారు. 3 లక్షలకు పైగా ఆస్ట్రేలియన్‌ డాలర్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. జర్మనీ, పాకిస్థాన్‌లలో ఉన్న ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్టు బిల్లా అంగీకరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు