తెదేపా నేతలను అడ్డుకున్న పోలీసులు

పెను విషాదానికి కారణమైన ఎల్జి పాలిమర్స్‌ పరిశ్రమను మూసివేయాలని డిమాండ్‌ చేస్తూ ఈరోజు ఉదయం నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి.

Published : 09 May 2020 13:10 IST

విశాఖపట్నం: పెను విషాదానికి కారణమైన ఎల్జి పాలిమర్స్‌ పరిశ్రమను మూసివేయాలని డిమాండ్‌ చేస్తూ ఈరోజు ఉదయం నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి. పరిశ్రమ గేటు వద్ద మృతదేహాలతో ఆందోళన చేస్తున్న బాధితులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న తెదేపా నేతలను పోలీసులు మార్గ మధ్యంలోనే అడ్డుకున్నారు. మాజీ మంత్రి బండారు సత్యానారాయణమూర్తి, పీలా గోవింద్‌, బాబ్జీని పరిశ్రమకు కిలోమీటరు దూరంలో గోపాలపట్నం రోడ్డుపైనే పోలీసులు అడ్డుకున్నారు. పరిశ్రమలోకి వెళ్లేందుకు అనుమతిలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తెదేపా నేతలు, పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని