విజయనగరం జిల్లాలో తొలి కరోనా మరణం

బలిజిపేట: విజయనగరం జిల్లాలో తొలి కరోనా మరణం నమోదైంది. ఐదు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 60 ఏళ్ల మహిళ మృతిచెందినట్టు ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. బలిజిపేట మండలం

Published : 09 May 2020 18:06 IST

విశాఖలో చికిత్స పొందుతూ మహిళ మృతి


 

బలిజిపేట: విజయనగరం జిల్లాలో తొలి కరోనా మరణం నమోదైంది. ఐదు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 60ఏళ్ల మహిళ మృతిచెందినట్టు ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. బలిజిపేట మండలం చిలకలపల్లికి చెందిన ఈమె ఈ రోజు విశాఖలో మృతిచెందినట్టు తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లో శనివారం కరోనా నియంత్రణ, వ్యవసాయ శాఖపై మంత్రి సమీక్షించారు. అనంతరం నాని మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో ఇప్పటివరకు 1930 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 887 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇందులో విజయనగరం జిల్లాలో ఇప్పటిదాకా నాలుగు పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. బలిజిపేట మండలం చిలకలపల్లికి చెందిన మహిళ మరణించారు. ఆమె కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతోంది. డయాలసిస్‌ జరుగుతున్న క్రమంలోనే ఇటీవల ఆమెకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుటుంబ సభ్యులందరికీ కరోనా పరీక్షలు చేయగా అందరికీ నెగెటివ్‌గా తేలింది’’ అని మంత్రి వివరించారు.  ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు కన్నబాబు, బొత్స సత్యనారాయణ, పాముల పుష్పశ్రీవాణితో పాటు జిల్లాస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని