గ్యాస్‌ లీక్‌ ఘటనపై ఎల్‌జీ పాలిమర్స్‌ క్షమాపణ

విశాఖ జిల్లా ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమలో గ్యాస్‌ లీకైన ఘటనకు తాము చింతిస్తున్నామంటూ ఆ కంపెనీ క్షమాణలు కోరింది...........

Published : 09 May 2020 20:26 IST

విశాఖపట్నం: విశాఖ జిల్లా ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమలో గ్యాస్‌ లీకైన ఘటనకు తాము చింతిస్తున్నామంటూ ఆ కంపెనీ క్షమాణలు కోరింది. ప్రమాదంలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపింది. ప్రమాదానికి గల కారణాలను అన్వేషించేందుకు విచారణలో ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ట్యాంక్‌ నుంచే స్టైరీన్‌ వాయువు విడుదలైందని ప్రాథమిక విచారణలో తేలిందని కంపెనీ పేర్కొంది.

ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఎల్‌జీ పాలిమర్స్‌ తెలిపింది. ఈ ఘటనలో బాధితులు, బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. ఘటనలో జరిగిన నష్టాన్ని ప్రభుత్వంతో కలిసి అంచనా వేస్తున్నామని, త్వరలోనే ప్యాకేజీని అందిస్తామని తెలిపింది. బాధితులు, వారి కుటుంబాలకు అవసరమైన సాయం అందిచేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని తెలిపింది. వారికి ఎలాంటి సాయమైనా ఈ బృందం అందిస్తుందని పేర్కొంది. ప్రమాద ఘటన అనంతరం సహాయక చర్యల్లో పాల్గొన్న అధికారులు, పోలీసులకు ధన్యవాదాలు తెలిపింది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని